'ఈనెల 14 వరకు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించాలి'
SRD: ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈనెల 14వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం ఆదివారం తెలిపారు. వంద రూపాయల ఫైన్‌తో 24 వరకు, 500 రూపాయల ఫైన్‌తో డిసెంబర్ 1 వరకు, 2000 రూపాయల ఫైన్ తో డిసెంబర్ 15 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు నేరుగా కళాశాల ప్రిన్సిపాల్ వద్ద పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు.