పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
KDP: బద్వేల్‌లోని గూడెం సమీపంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు గాండ్ల తిమ్మాయపల్లె గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.