పెరుగుతున్న పేకాట.. టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో వెలుగులోకి!
హన్మకొండ: నగరంలో పేకాటరాయుళ్ల ఆటలు చెలరేగిపోతున్నాయి. ప్రత్యేక డెన్లు ఏర్పాటు చేసుకొని బృందాలుగా ఏర్పడి ఆడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి. గడిచిన మూడు నెలల్లో 28 కేసులు నమోదు కాగా.. 128 మంది నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.పేకాటకు బానిసగా మారవద్దని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ కోరారు.