వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
MHBD: మహబూబాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జనాలు జరిగే నిజాం చెరువు ప్రాంతాన్ని గురువారం ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ సందర్శించారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే విధానాన్ని ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు సీఐ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.