పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కారు బీభత్సం

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కారు బీభత్సం

AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కారు బీభత్సం సృష్టించింది. చిలకలూరిపేట విజయ బ్యాంకు సెంటర్‌లో హోటల్‌లోకి కారు దూసుకెళ్లింది. దీంతో హోటల్‌లోని సామగ్రి, ఫర్నీచర్ ధ్వంసమైంది. గంజాయి మత్తులో కారు వేగంగా నడిపారని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారని, వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.