శిధిలావస్థకు చేరుకున్న ఓవర్ హెడ్ ట్యాంక్

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరం గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలిపోతుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్ నాలుగు పిల్లర్లలో ఒక పిల్లర్ నుంచి శిధిలాలు బయట పడ్డాయి. శిథిలమైన ఓవర్ హెడ్ ట్యాంక్ పిల్లర్లకు మరమ్మత్తులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.