కౌలు రైతుల సంక్షేమానికి నూతన చట్టం కావాలి: CPI
GNTR: కౌలు రైతుల రక్షణ కోసం నూతన చట్టం తీసుకురావాలని ఏపీ కౌలురైతుల సంఘం గుంటూరు జిల్లా సమితి డీఆర్ఎ ఖాజావలీకి వినతిపత్రం సమర్పించింది. రుణాలు, పథకాలు, పంట బీమా సదుపాయాలు కల్పించాలని కోరింది. గ్రామసభల ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చి ఈ-పంటలో నమోదు చేయాలని సూచించింది. వడ్డీలేని రుణాలు, ఎక్స్‌గ్రేషియా సహాయం ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు.