తడి పొడి చెత్త పై అవగాహన కార్యక్రమం

తడి పొడి చెత్త పై అవగాహన కార్యక్రమం

NGKL: కల్వకుర్తి మండలం మార్చాలలో గ్రామపంచాయతీ అధికారులు ఆదివారం తడి, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ తలసాని కృష్ణారెడ్డి స్వయంగా వాడవాడలా తిరుగుతూ.. ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి పంచాయతీ సిబ్బందికి అందించాలని ఆయన కోరారు.