NH-16 పై బ్లాక్ స్పాట్స్ పరిశీలన
కృష్ణా: హనుమాన్ జంక్షన్ NH-16 పరిధిలోని బ్లాక్‌స్పాట్ ప్రాంతాన్ని CI ఎల్.రమేష్, SI వి.సురేష్, NHAI అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రమాదాలకు దారితీసే రోడ్డు నిర్మాణ లోపాలు, సైన్ బోర్డుల కొరత, స్పీడ్ కంట్రోల్ చర్యలపై చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.