ఆర్టీసీ కార్మికులకు బీజేపీ సంపూర్ణ మద్దతు
PDPL: మంథని బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు గురువారం భారీ ఎత్తున సమ్మె చేపట్టారు. 2వ రోజు సమ్మెకు మంథని బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను నేడు ప్రభుత్వం విస్మరించడం దుర్మార్గమన్నారు. కార్మికుల సమస్యలు తీరే వరకు వారి వెంటే ఉండి బీజేపీ పోరాడుతుందన్నారు.