VIDEO: విజయనగరంలో శివునికి అభిషేకాలు
విజయనగరం స్థానిక అసపు వీధిలో గల శివాలయంలో అర్చకులు కాకర గోవిందరావు వేకుజాము నుండి శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్బంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి గోత్ర నామాలతో పూజలు చేయించుకున్నారు. మహిళలు ధ్వజ స్తంబాల వద్ద దీపాలు వెలిగించి, పసుపు, కుంకుమ సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాదం అందజేశారు.