రంగారెడ్డి ప్రమాదం.. మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు
TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణం ఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.