'ఎనలిస్టులు విశ్లేషణకే పరిమితం కావాలి'
W.G: భీమవరంలో ఎంపీ కార్యాలయంలో పాలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్‌ను ఉద్దేశిస్తూ కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యలు చేశారు. "విశ్లేషకులు పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు అయిపోదాం అనుకుంటే ఇది ఒక గుణపాఠం" అని అన్నారు. రాజకీయం చేసేవారు రాజకీయం చేయాలని, విశ్లేషణ చేసేవారు విశ్లేషణకే పరిమితం కావాలని ఆయన స్పష్టం చేశారు.