'ఫోటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలి'

MDK: రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. లూయిస్ డాగురే చిత్రపటానికి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సెల్ ఫోన్ రావడంతో ఫోటోగ్రఫీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఏర్పడిందని, ఫోటోగ్రాఫర్లు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.