పోలీసుల అదుపులో గంజాయి బ్యాచ్

GNTR: పొన్నూరులో గంజాయి విక్రయిస్తూ సేవిస్తున్న కొందరు యువకులను అర్బన్ పోలీసులు గత సోమవారం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నలుగురు యువకులు గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్నట్టు సమాచారం మేరకు అర్బన్ పోలీసులు వారిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. గంజాయి ఎవరు తెచ్చారు. పట్టణంలో ఎవరెవరు విక్రయిస్తున్నారనే కోణంలో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.