హోటల్ రూమ్స్‌లో పోలీసుల తనిఖీలు

GNTR: భద్రత చర్యల్లో భాగంగా తాడేపల్లి పరిధిలోని అన్ని హోటల్స్ రూమ్స్‌ను సీఐ కళ్యాణ్ రాజు తనిఖీ చేశారు. శనివారం లాడ్జిల్లో ఉన్న రిసెప్షన్ వారితో మాట్లాడి ఎవరెవరు వస్తున్నారు, వెళుతున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోటల్ రికార్డులను తనిఖీ చేశారు. హోటల్ రూమ్‌లో ఉన్న వారితో మాట్లాడి ఎక్కడి నుంచి వచ్చారనే వివరాలను సరిపోల్చుకున్నారు.