త్వరలో కనుమరుగు కానున్న సర్ సిల్క్ మిల్లు

త్వరలో కనుమరుగు కానున్న సర్ సిల్క్ మిల్లు

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ మిల్లు త్వరలో కనుమరుగు కానుంది. మిల్లు స్థలాన్ని ఈనెల 20న ఈ వేలం ద్వారా విక్రయించనున్నారు. మిల్లు స్థలంలో కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని నాయకులు హామీలు ఇచ్చి ఆచరణలో చూపలేదు. సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యమే స్థలాన్ని కొనుగోలు చేసి పేపర్ మిల్లును మరింత విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు.