పెద్దేముల్ మండల కేంద్రంలో హోలీ సంబరాలు
VKB: పెద్దేముల్ మండల కేంద్రంలో హోలీ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు రంగులు చల్లుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో మాత్రమే మంగళవారం హోలీ పండుగను నిర్వహించారు. మరికొన్ని గ్రామాల్లో బుధవారం నిర్వహించనున్నట్లు పలువురు చెప్తున్నారు.