కర్ణాటకలో మిస్సింగ్.. కుప్పంలో డెడ్ బాడీ

కర్ణాటకలో మిస్సింగ్.. కుప్పంలో డెడ్ బాడీ

CTR: కర్ణాటక అత్తిబెలే వద్ద మిస్సైన కుప్పం ఎన్టీఆర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గత నెల 27 నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అత్తిబెలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో రామకుప్పం మండలం ముద్దునపల్లికి చెందిన ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడే శ్రీనాథ్ మృతదేహాన్ని జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో పూడ్చిపెట్టినట్లు బయటపడింది.