నేడు కాజీపేటకు రానున్న ఇద్దరు కేంద్ర మంత్రులు

HNK: కాజీపేట అయోధ్యాపురంలో నిర్మాణమవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సందర్శనకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రానున్నారు. శనివారం ఫ్యాక్టరీని సందర్శించి నిర్మాణ పురోగతిని పరిశీలించనున్నారు. వీరితో పాటు SCR జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, డివిజనల్ మేనేజర్ భర్తేశ్ కుమార్ జైన్ సైతం ఫ్యాక్టరీకి రానున్నారు.