బీసీ రిజర్వేషన్లపై స్టే పొడిగింపు
TG: బీసీ రిజర్వేషన్ల పెంపు ఉత్తర్వులపై స్టే పొడిగింపు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని ధర్మాసనం వెల్లడించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ రిజర్వేషన్ల పెంపు సుప్రీంకోర్టు విధించిన 50% రిజర్వేషన్ల పరిమితిని ఉల్లంఘిస్తుందని పిటిషనర్లు పేర్కొన్నారు.