కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
MBNR: మహ్మదాబాద్‌లోని గండీడ్ కేజీబీవీని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్ఓ డి.పావనిని, భర్తతో డ్యూటీ చేయిస్తున్న నైట్ వాచ్‌మెన్ జైతున్ బేగంను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కఠిన చర్యలు తీసుకున్నారు. అలాగే సరిగ్గా బోధించని ఇంగ్లీష్ టీచర్ శోభకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.