ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: ఎస్పీ

NRML: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదార్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు.