నేడు మునిపల్లిలో పర్యటించనున్న మంత్రి
SRD: మునిపల్లి మండలంలో మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం పర్యటిస్తారని క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 2 గంటలకు మేళా సంఘంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తారని చెప్పారు. మూడు గంటలకు చల్మడ గ్రామంలో సోయా పర్చేస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.