ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
SRCL: నేటితో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. ఈ సందర్భంగా గత 15 రోజులుగా పరీక్ష ఒత్తిడితో ఉన్న విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా నిర్వహించబడినట్లు DIEO శరత్ కుమార్ తెలిపారు. అధికారులు త్వరలోనే ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.