BREAKING: ఖమ్మం జిల్లాలో దారుణం
TG: ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సీపీఎం రైతు సంఘం నేత సామినేని రామారావును దుండగులు హతమార్చారు. చింతకాని మండలం పాతర్లపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఆయన్ను గొంతుకోసి చంపేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు.