గోడౌన్‌ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన సంస్థ ఛైర్మన్
KMM: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు మంగళవారం రాత్రి ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండా గ్రామంలోని గిడ్డంగుల సంస్థ గోడౌన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్‌లో నిల్వ ఉన్న సన్న బియ్యం నిల్వలను వాటి భద్రత రక్షణ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రేషన్ దుకాణాలకు సన్న బియ్యాన్నే సరఫరా చేయాలని వారు అధికారులకు ఆయన సూచించారు.