APK ఫైల్స్‌తో జాగ్రత్త: ఎస్పీ
WNP: వాట్సాప్ గ్రూపులో వచ్చే అపరిచిత ఏపీకే ఫైల్స్ డౌన్ లోడ్ చేయవద్దని ఎస్పీ రావుల గిరిధర్ ప్రజలకు సూచించారు. ఆఫర్లు, బహుమతుల పేర్లతో వచ్చే ఈ ఫైల్స్ డౌన్‌లోడ్ చేస్తే మీ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఫైల్స్ ద్వారా ఫోన్లలోకి వైరస్ చొరబడి డేటా చోరీకి అవకాశం ఉందని వెల్లడించారు.