మండుతున్న ఎండలు

మండుతున్న ఎండలు

BHNG: జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నెల పూర్తి కాకముందే ఎండల తీవ్రత పెరిగింది. పొలాల్లో పనులు చేసే రైతులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య అధికారులు సూచిస్తున్నారు. రైతులు పనులకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్స్, ఓఆర్ఎస్ లాంటివి దగ్గర పెట్టుకోవాలని నిపుణులు వెల్లడించారు. గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.