సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో

KKD: కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో వెంకట నారాయణ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రికార్డులను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని సూచించారు.