బాలికను మోసం చేసిన యువకుడిపై పోక్సో కేసు

KKD: అయినవిల్లి మండలం మాగం గ్రామానికి చెందిన రాఖేష్(19) అల్లవరం మండలంలో నివాసం ఉంటున్న బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంపత్ కుమార్ గురువారం తెలిపారు.