గోతులు తప్పించబోయి బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

గోతులు తప్పించబోయి బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఎన్టీఆర్: మైలవరం మండలం వెల్వడం గ్రామం భాస్కర్ నగర్ వద్ద ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు గోతులు తప్పించబోయి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్‌లో చికిత్స కోసం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.