పోలీస్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి: సీఐ

NZB :గణేశ్ ఉత్సవాల్లో భాగంగా బోధన్ పట్టణంలో ఉత్సవ నిర్వాహకులు పోలీస్ శాఖ రూపొందించిన ప్రత్యేక పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ సూచించారు. పట్టణంలో గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వహకులు ముందస్తు అనుమతి తీసుకుంటే మానిటరింగ్ చేయడం సులభం అవుతుందన్నారు.