మామిడాలపల్లి యువత వినూత్న ప్రచారం
KNR: వీణవంక మండలం మామిడాలపల్లి బస్టాండ్ ఆవరణం వద్ద యువత 'ఓటు అమ్మబడదు, గ్రామ అభివృద్ధికే మన ఓటు' అని ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఒక ఆయుధం లాంటిది అని యువకులు డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా, గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపే నాయకుడిని ఎన్నుకోవాలని యువత ప్రజలను ఈ వినూత్న ఫ్లెక్సీ అందరిని ఆలోచింపజేసింది.