గ్రామసభల్లో సమస్యలను పరిష్కరించుకోవాలి: కలెక్టర్
NRPT: మద్దూరు మండలంలోని దోరేపల్లిలో గురువారం నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమకు ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా గ్రామసభల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీడీవో రామన్న తదితరులు పాల్గొన్నారు.