VIDEO: ఈదురుగాలులతో కూడిన భారీ వడగళ్ల వర్షం
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వడగళ్ల వర్షం కురిసింది. భారీగా రాళ్లు పడడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కొన్ని రోజులుగా తీవ్ర ఎండ వేడిమితో బాధపడుతున్న మండల ప్రజలకు వర్షం స్వల్ప ఉపశమనం కల్పించింది.