నిర్మల్‌లో రహదారులపై పశువుల సంచారం

నిర్మల్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా, ఈద్గాం చౌరస్తా, చైన్టేట్ వంటి ప్రధాన రహదారులపై పశువుల సంచారంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళలో వాటిని గమనించక ప్రమాదాలకు గురై కొందరు మరణిస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి రోడ్లపై సంచరిస్తున్న పశువులను గోశాలకు తరలించాలని లేదా వాటి యజమానులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.