ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్
JGL: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం దరూర్ క్యాంప్‌లోని ఈవీఎం గోదామును తనిఖీ చేశారు. గోదాములో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక అంశాలను పరిశీలించారు. ఎలాంటి లోపాలు లేకుండా పటిష్ట భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తంగా పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు.