సర్పంచ్ ఎన్నిక.. జాక్‌పాట్ కొట్టిన మహిళ
TG: వరంగల్ జిల్లా సంగెం మండలంలో ఓ మహిళ జాక్‌పాట్ కొట్టింది. ఆశాలపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళలకు రిజర్వ్ కావడంతో.. ఆ గ్రామంలో ఉన్న ఏకైక ఎస్సీ మహిళా ఓటరు కొంగర మల్లమ్మ ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అయితే పంచాయతీలో 1,600 మందికి పైగా ఓటర్లు ఉన్నా.. రిజర్వేషన్ కారణంగా మల్లమ్మ ఒకరే పోటీకి అర్హత సాధించారు.