NAC కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్
SRD: జిల్లాలోని ప్రభుత్వ ITI NAC కేంద్రానికి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఇవాళ సందర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మంచి ప్రావీణ్యం సాధించి జిల్లాకు, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మేస్త్రీలకు ఆయన సూచించారు. నూతన పరిజ్ఞానం అందించడంలో NAC శిక్షకుల కృషి అవసరమన్నారు. ఇందులో అదనపు DRDO సూర్యారావు, హౌసింగ్ ఇంచార్జి PD పుష్మలత, DPM రమేష్ బాబు ఉన్నారు.