108 జలబిందలతో భక్తుల పూజలు

108 జలబిందలతో భక్తుల పూజలు

SRPT: తుంగతుర్తి మండలం గానుగుబండలోని కనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా దుర్గాదేవి అమ్మవారికి 108 జలబిందలతో భక్తులు జలాభిషేకం నిర్వహించారు. గుండగాని వెంకటేశ్వర్లు-స్వప్న దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారిని పట్టుచీరలతో అలంకరించారు. కార్యక్రమంలో పూజారి శ్రీకాంత్, రామచంద్రారెడ్డి, ఝాన్సీరెడ్డి, సత్తెమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.