డిగ్రీ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ
నిర్మల్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ పురుషుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.విజయ్ కుమార్ తెలిపారు. ఇంటర్ పూర్తయిన వారు మే 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి ఉచిత హాస్టల్ వసతితో పాటు పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామన్నారు.