VIDEO: 'కోటవురట్లలో ప్రపంచ తపాలా దినోత్సవం'

AKP: కోటవురట్లలో బుధవారం ప్రపంచ తపాలా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్ట్ ఆఫీసులో ఉన్న పథకాలు, వాటి వల్ల ఉపయోగాలపై కళాజాత నిర్వహించారు. అనకాపల్లి పోస్టల్ డివిజన్ పబ్లిక్ రిలేషన్ మేనేజర్ పలాసరావు మాట్లాడుతూ.. పోస్ట్ ఆఫీసులో ఇన్సూరెన్స్, ఫిక్సిడ్ డిపాజిట్లు ఇంకా అనేక పథకాల గురించి తెలియజేశారు. పోస్ట్ ఆఫీస్ 170 ఏళ్ళుగా ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు.