శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
BDK: భద్రాచలంలో ఈ నెల 27న నిర్వహించనున్న శ్రీరామనవమి, 28న మహా పట్టాభిషేకం ఉత్సవాల ఏర్పాట్లను మంగళవారం రాత్రి కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. ఉత్సవాలకు సమయం తక్కువగా ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లలో వేగం పెంచాలని ఆదేశించారు. సీఎం పర్యటన దృష్ట్యా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల్లో ఎటువంటి లోపాలు లేకుండా సిద్ధం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.