ముఖం నిండా దుప్పటి కప్పుకుంటున్నారా?
చలికాలంలో కాళ్ల నుంచి ముఖం వరకు దుప్పటిని కప్పుకోవడం చాలా మందికి అలవాటు. దీంతో శరీరం వెచ్చగా ఉంటుంది. అందుకే చాలా మంది ఇలా నిండుగా కప్పుకుని పడుకుంటుంటారు. అయితే ముఖానికి కూడా దుప్పటి కప్పుకోవడం వల్ల ఊపిరితిత్తులకు సరిగ్గా గాలి అందదు. దీనివల్ల తలనొప్పి, ఆస్తమా, చర్మం రంగు మారిపోవడంతో పాటు చర్మంపై ముడతలు కూడా వచ్చే అవకాశముందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.