'బాల్య వివాహాల నివారణకు కృషి చేయాలి'
VKB: బాల్యవివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తహసీల్దార్ షాజిదా బేగం అన్నారు. ధారూర్ మండల కేంద్రంలో బాల్యవివాహాల నిరోధన రథయాత్రను ముగించి, మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ మండలాల గ్రామాల్లో 100 రోజుల పాటు బాల్య వివాహాల నివారణ యాత్ర నిర్వహించి, అవగాహన కల్పించామని తెలిపారు. బాల్యవివాహాలు చేసి చిన్నారుల జీవితాలను నాశనం చేయవద్దని ఆమె వేడుకున్నారు.