వేములలో విద్యుత్ సరఫరాలో మార్పులు

వేములలో విద్యుత్ సరఫరాలో మార్పులు

KDP: వేముల పరిధిలోని శేషన్నగారిపల్లి ఫీడర్లో వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ సరఫరా సమయాల్లో మార్పు చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు ఉదయం 6.00 నుంచి 11.00 గంటల వరకు మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు విద్యుత్ సరఫరా చేయబడుతుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు