రోడ్డు ప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసింది: మాధవ్

రోడ్డు ప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసింది: మాధవ్

AP: అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం సంభవించిన విషయం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, గాయపడిన వారికి వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.