VIDEO: నందికొట్కూరులో ఘనంగా రథసప్తమి వేడుకలు
NDL: నందికొట్కూరు పట్టణంలో కోట వీధిలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా శ్రీ ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. దేవాలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.