ముకురాల-రంగపూర్ మార్గంలో ప్రమాదకరంగా మారిన రోడ్డు
NGKL: బిజినపల్లి మండలం ముకురాల-రంగపూర్ గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. రోడ్డు పక్కన మట్టి కొట్టుకుపోవడంతో, అంచున పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ కీలక మార్గంలో ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చని స్థానికులు భయపడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.